Friday, September 30, 2022

విశ్వనరుడు "గుర్రం జాషువా" 127వ జయంతి సభ






















  పేదరికం, కులవివక్షత, మత వివక్ష లను నిరసించిన మహనీయుడు శ్రీ గుర్రం  జాషువా గారు :

అసమానతలకు వ్యతిరేకంగా అందరూ సమానమే అంటూ తన కలాన్ని ఆయుధంగా  మార్చి సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీ గుర్రం.జాషువా అని మీర్జాపూర్  పి.జి.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శివశంకర్  అన్నారు.  28-09-2022 (బుధవారం)  నాడు స్థానిక శ్రామిక విజ్ఞాన  కేంద్రం,  ఎన్జీవోస్ కాలనీ లో  జరిగిన గుర్రం జాషువా 127 వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిధిగా  పాల్గొన్నారు.  జాషువా  గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో చేసి  ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ,  సమాజంలో కుల మత భేదాలు లేకుండా,   సమానత్వ భావాలను పెంపొందించాలనీ  ఆయన అన్నారు.  ఈ సభలో పాల్గొన్న మరో అతిథి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ శ్రీ వినయ్ కుమార్ గారూ మాట్లాడుతూ సామాజిక వివక్షతలపై అలుపెరగని పోరాటం సాధించిన యోధుడు గుర్రం జాషువా అని కొనియాడారు. అలాంటి మహనీయుని  జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.  శ్రామిక్ విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ. బి.రాంచందర్,   సెక్రటరీ మరియు ప్రగతి నర్సింగ్ హోమ్ వైద్యులు శ్రీ కె.శివబాబు, ట్రెజరర్  శ్రీ యస్ మహిపాల్ మరియు  ట్రస్టు సభ్యులు శ్రీమతి డాక్టర్ కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాషువా జయంతి సందర్భంగా ఆయన రచనలపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్న  250 మందికి పైగా విద్యార్ధినీ  విద్యార్థులకు ఈ సభలో బహుమతులు అందజేశారు. 

No comments:

Post a Comment

విశ్వనరుడు "గుర్రం జాషువా" 127వ జయంతి సభ

   పేదరికం, కులవివక్షత, మత వివక్ష లను నిరసించిన మహనీయుడు శ్రీ గుర్రం  జాషువా గారు : అసమానతలకు వ్యతిరేకంగా అందరూ సమానమే అంటూ తన కలాన్ని ఆయుధ...