Friday, September 30, 2022

విశ్వనరుడు "గుర్రం జాషువా" 127వ జయంతి సభ






















  పేదరికం, కులవివక్షత, మత వివక్ష లను నిరసించిన మహనీయుడు శ్రీ గుర్రం  జాషువా గారు :

అసమానతలకు వ్యతిరేకంగా అందరూ సమానమే అంటూ తన కలాన్ని ఆయుధంగా  మార్చి సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీ గుర్రం.జాషువా అని మీర్జాపూర్  పి.జి.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శివశంకర్  అన్నారు.  28-09-2022 (బుధవారం)  నాడు స్థానిక శ్రామిక విజ్ఞాన  కేంద్రం,  ఎన్జీవోస్ కాలనీ లో  జరిగిన గుర్రం జాషువా 127 వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిధిగా  పాల్గొన్నారు.  జాషువా  గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో చేసి  ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ,  సమాజంలో కుల మత భేదాలు లేకుండా,   సమానత్వ భావాలను పెంపొందించాలనీ  ఆయన అన్నారు.  ఈ సభలో పాల్గొన్న మరో అతిథి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ శ్రీ వినయ్ కుమార్ గారూ మాట్లాడుతూ సామాజిక వివక్షతలపై అలుపెరగని పోరాటం సాధించిన యోధుడు గుర్రం జాషువా అని కొనియాడారు. అలాంటి మహనీయుని  జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.  శ్రామిక్ విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ. బి.రాంచందర్,   సెక్రటరీ మరియు ప్రగతి నర్సింగ్ హోమ్ వైద్యులు శ్రీ కె.శివబాబు, ట్రెజరర్  శ్రీ యస్ మహిపాల్ మరియు  ట్రస్టు సభ్యులు శ్రీమతి డాక్టర్ కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాషువా జయంతి సందర్భంగా ఆయన రచనలపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్న  250 మందికి పైగా విద్యార్ధినీ  విద్యార్థులకు ఈ సభలో బహుమతులు అందజేశారు. 

Thursday, September 22, 2022

 Independence Day Celebrations







మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75సం.లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్రం కోసం ప్రాాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుని, వారి ఆశయసాధనకై పిల్లలు, యువకులను ఉత్తేజపరిచి, కర్తవ్యదీక్షులుగా చేసేందుకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆగస్టు 15, 2022 నాడు ప్రదర్శన, సభ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.   స్వాతంత్రోద్యమంలోనూ, సంఘసంస్కరణోద్యమాల్లోనూ ఆజన్మాంతం కృషి చేసిన మహాత్మాగాంధి, నెహ్రూ, అంబేద్కర్,  భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు, సుభాస్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, మల్లు స్వరాజ్యం, కెప్టెన్ లక్ష్మీసెహగల్, అల్లూరి సీతారామరాజు,  సావిత్రిబాయి పూలే, దుర్గాబాయి దేశ్ ముఖ్,  మంది దేశభక్తుల వేషధారణతో చేసిన చిన్నాారుల ప్రదర్శన పట్టణవాసులను ఎంతో ఆకర్షించింది. 

       ప్రదర్శన అనంతరం యన్.జి.ఓ కాలని, జహీరాబాద్ లోని శ్రామిక్ భవన్ లో స్వాతంత్రదిన వేడుకల సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా స్ధానిక రంజోల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ.కుమారస్వామి గారు,  విశిష్ట అతిధిగా ఆర్.ఎల్.ఆర్ కళాశాల డైరెక్టర్ శ్రీ.లక్ష్మారెడ్డి గారు, ప్రత్యేక అతిధిగా ప్రముఖ స్పోకెన్  ఇంగ్లీష్ సెంటర్ రస్సెల్స్ స్పోకెన్ ఇంగ్లీష్, హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ. జహీర్ గారు, స్ధానిక బస్తీ పెద్దలు చంద్రారెడ్డి గారు, జహీరాబాద్ టౌన్ ఎస్.ఐ శ్రీ.శ్రీకాంత్ గారు , శ్రామిక్ భవన్ నిర్మాణ కమిటి కన్వీనర్ శ్రీ.బి.రాంచందర్ గారు, భగత్ సింగ్ ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ శ్రీ.యస్.మహీపాల్ గారు, జనవిజ్ఞానవేదిక జిల్లా గౌరవాద్యక్షులు శ్రీ.డా.కె.శివబాబు గారు, మనలైబ్రరి వ్యవస్ధాపకురాలు మరియు స్రీలవైద్యులు డా.ఎ.విజయలక్ష్మి గారు, జనవిజ్ఞానవేదిక జిల్లా అద్యక్షులు శ్రీ.ఐ.ప్రతాప్ కుమార్ గారు,  కిడ్స్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్  శ్రీమతి ఎస్తేర్ రాణిగారు, అఖిలభారతమహిళాసంఘం పట్టణ నాయకురాలు శ్రీమతి షాహిదాబేగం గారు, మేధ్స్ టీచర్ శ్రీ. వలి గారు, పి.యస్.యస్ ట్రస్ట్ ట్యూటర్ శ్రీ. రామచంద్రయ్య గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ.విశ్వనాధం గారు, ఉపధ్యాయ సంఘం నాయకురాలు శ్రీమతి సువర్ణగారు, మల్లు స్వరాజ్యం స్మారక  ఉచిత కుట్టుశిక్షణా కేంద్రం బాధ్యులు శ్రీమతి లలితగారు, మీనా గారు, విద్యార్ధినాయకులు రాజేష్, దుర్గాప్రసాద్, మల్లేశం, హరీష్, సాయి, ప్రకాష్, చంద్రవర్ధన్, ట్యూటర్లు మేఘన, సంజన, ప్రజ్ఞ, రేణుక, టైలరింగ్ టీచర్ శ్రీమతి నస్రీన్ గారు,  టీచర్ షాహిన్ గారు, అంగన్ వాడి నాయకురాలు అనూరాధ గారు, భవననిర్మాణ ఆడిట్ బాధ్యులు శ్రీ.దక్షిణామూర్తి గారు, మహీంద్రా యూనియన్ నాయకులు శ్రీ.రాజిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న అతిధులు సభనుద్దేశించి ఉత్తేజకరంగా ప్రసంగించారు. సభలో విద్యార్ధినీ విద్యార్ధులు పలు దేశభక్తి గీతాలు, డాన్స్, నాటిక, ఏకపాత్రాభినయం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.  వ్యాసరచన, ఉపన్యాసం, డిజిటల్ ఆర్ట్  తదితర పోటీలలో గెలుపొందిన  విద్యార్ధినీవిద్యార్ధులకు అతిధులు బహుమతులు అందజేశారు.  ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం పట్టణప్రజల్లోనూ, సభికుల్లోనూ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్ఫూర్తిని నింపిదనడంలో అతిశయోక్తి లేదు. 






























































విశ్వనరుడు "గుర్రం జాషువా" 127వ జయంతి సభ

   పేదరికం, కులవివక్షత, మత వివక్ష లను నిరసించిన మహనీయుడు శ్రీ గుర్రం  జాషువా గారు : అసమానతలకు వ్యతిరేకంగా అందరూ సమానమే అంటూ తన కలాన్ని ఆయుధ...